రాహుల్, స్వప్నల పెళ్ళికి రుద్రాణిని బలవంతంగా ఒప్పించిన దుగ్గిరాల ఫ్యామిలీ!
on Jun 4, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -113 లో కనకం ఇంటికి సీతరామయ్య, ఇందిరాదేవి, రాజ్ లు వెళ్లి.. మా ఇంట్లో మనిషి తప్పు చేసాడు, అందుకు న్యాయం చేయడానికి ఇక్కడికి వచ్చామని సీతరామయ్య అంటాడు. తెలిసో తెలియకో తప్పు జరిగిపోయింది.. ఈ విషయం బయట వారికి తెలియకముందే వారం రోజులలో రాహుల్, స్వప్నల పెళ్లి చెయ్యాలని సీతరామయ్య అంటాడు. అది విని కనకం ఫ్యామిలీ ఒప్పుకొని సంతోషపడుతారు.
మరొకవైపు సుభాష్, ప్రకాష్ లు ఇద్దరు రాహుల్ చేసిన పనికి అతడిని తిడుతారు. "పిల్లల్ని ఇలానేనా పెంచేది. ఇంట్లో స్థానం ఇచ్చినందుకు మా ఇంటి పరువు పోయేలా చేశారు" అంటూ సుభాష్ అంటాడు. అంతా కలిసి నా కొడుకు ఒక్కడే తప్పు చేసాడంటే ఎలా.. ఆ స్వప్న కూడా తప్పు చేసింది కదా అని రుద్రాణి అంటుంది. ఇప్పుడు నీ కొడుకు జీవితం ఏం నాశనం కాలేదు.. అక్కడ స్వప్న జీవితమే నాశనం అయిందని ధాన్యలక్ష్మి అంటుంది. అప్పుడే కనకం ఇంటి నుండి సీతరామయ్య, ఇందిరాదేవి, రాజ్ లు వస్తారు. రాహుల్ పెళ్లి స్వప్నతో జరిపిస్తామని కావ్య కుటుంబం కి మాట ఇచ్చి వచ్చామని సీతరామయ్య అంటాడు. నేను ఒప్పుకోను ఎవరిని అడిగి సంబంధం ఒప్పుకొని వచ్చారని రుద్రాణి కోప్పడుతుంది. మా అందరి అంగీకారంతోనే వాళ్ళు వెళ్లి మాట్లాడి వచ్చారని అపర్ణ అంటుంది. మీ అందరు అంగీకరిస్తే సరిపోద్దా? నేను సమ్మతించవద్దా అని రుద్రాణి అంటుంది. ఆస్తి, అంతస్తు ఏమి లేని పిల్ల నా కోడలా నేను ఒప్పుకోనని రుద్రాణి అంటుంది. ఈ ఏమి లేని పిల్లనే నా కొడుకుకి ముసుగు వేసి చేసావ్ కదా.. చెల్లుకి చెల్లు అని అపర్ణ అంటుంది. అయినా సరే నేను ఒప్పుకోనని రుద్రాణి అనగానే.. ఒప్పుకోకపోతే శాశ్వతంగా ఈ దుగ్గిరాల కుటుంబం నుండి బయటకు వెళ్ళవలిసి వస్తుందని ఇందిరాదేవి అంటుంది. అయినా రాహుల్ స్వప్నలిద్దరూ వరుసకి అన్నా చెల్లెలు అవుతారు. అలా పెళ్లి చెయ్యడం కరెక్ట్ కాదని రుద్రాణి అంటుంది. "నా భర్తని నువ్వు అన్నయ్య అని పిలుస్తున్నావ్.. నువ్వు ఏమైనా నా భర్త తోడబుట్టిన దానివా.. కాదు కదా.. నీకు ఈ దుగ్గిరాల కుటుంబంకి ఎలాంటి సంబంధం లేదు పెళ్లి చేసుకోవచ్చు" అని అపర్ణ అంటుంది.
ఆ తర్వాత దీనంతటికి కారణం కావ్య.. దీనివల్లే ఇదంతా అని రాహుల్ అనగానే.. రాహుల్ చెంప పగలగొడతాడు రాజ్. ఈ ఇంటి కోడలిని మర్యాద లేకుండా మాట్లాడతావా అంటూ సుభాష్ కోప్పడుతాడు. ఆ తర్వాత రాహుల్, రుద్రాణిలు కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరొకవైపు స్వప్న మాత్రం పొగరు తగ్గకుండా అలానే ఉంటుంది. అప్పుతో పొగరుగా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read